టిటిడి బోర్డులో నేరచరిత్ర ఉన్నవారి నియామకంపై హైకోర్టు ఆగ్రహం..

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని నియమించడంపై ఎపి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టిటిడి బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ బిజెపి నేత భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. టిటిడి బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని నియమించడంపై వెంటనే ప్రతివాదులకు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి, టిటిడి కార్యనిర్వాహణాధికారికీ నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.