తెలంగాణలో సంస్థాగత కమిటీల ప్రకటన: జనసేన

జనసేనను తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందకు పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా తెలంగాణలో జనసేన సంస్థాగత కమిటీలను ప్రకటించారు. విద్యార్థి, యువజన కమిటీలను పవన్‌కల్యాణ్ నియమించారు. జనసేన తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా సంపత్‌ నాయక్‌ను ఎన్నుకున్నారు. విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణను నియమించారు. అంతేకాకుంగా యువజన విభాగం అధ్యక్షుడిగా వి.లక్ష్మణ్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా కిరణ్‌కుమార్‌ను నియామించారు. జనసేన సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా దుంపటి శ్రీనివాస్‌ను నియమించారు.