పలమనేరులో జనసేనాని జన్మదిన వేడుకలు

పలమనేరు, జనసేనాని జన్మదినం సందర్భంగా పలమనేరు రూరల్ మండలంలో అంగరంగ వైభవంగా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అలాగే రూరల్ మండల ఉపాధ్యక్షుడు వినోద్ రాయల్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు పుస్తకాల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు నాగరాజు మోతుకూరు మాట్లాడుతూ.. మండల పరిధిలో ఉన్న నాయకులకు, కార్యకకర్తలకు ఎటువంటి సమస్య వచ్చిన మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు, అలాగే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి పూర్తిస్థాయిలోతీసుకుని వెళ్తామని చెప్పారు. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని తప్పకుండ మార్పు చూస్తామని చెప్పారు రానున్న ఎన్నికల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ సీనియర్ నాయకులు సందీప్ రాయల్, రమేష్, రాజశేఖర్, చిరంజీవి, మోహన్, చైతన్య యాదవ్,ఉపాధక్షులు వినోద్ రాయల్, జనరల్ సెక్రటరిలు పవన్ కళ్యాణ్, మాధవ, మహేష్, అజిత్ కుమార్, ఎంపీటీసీ అభ్యర్థి వెంకటేష్, కార్యదర్శులు జ్యోతిబోస్, దిలీప్,గాంధీ, ద్రోణంరాజ్, చంద్రశేఖర్, వేణు, గోపి, శబరి, కోదండ, గణేష్, నాని, సుమంత్, శశి, మహేష్, వినోద్, సతీష్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.