పవనన్న ప్రజా బాటకు 100 రోజులు

  • 1500 మంది జనాభాతో భారీ ర్యాలీ
  • రాజంపేటలో ర్యాలీ చేపట్టిన జనసేన ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట : పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా రాజంపేట నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఆదివారం నాటికి దిగ్విజయంగా100 రోజులు పూర్తి చేసుకుంది. మొదట రాజంపేట పట్టణంలోని మన్నూరు ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి జన సందోహంతో భారీ ర్యాలీగా తిరుపతి రోడ్డులోని వజ్రం ఫంక్షన్ హాలు వరకు పాదయాత్రగా వెళ్లారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనను ఆదరించాలని వేడుకున్నారు. బాణాసంచా పేలుళ్ల మధ్య మలిశెట్టి వెంకటరమణ ర్యాలీ చేపట్టగా అడుగడుగునా జనసేన కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వజ్రం ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం చేసుకోవాలన్న లక్ష్యంతో, ప్రజల ఆశీర్వాదంతో ప్రారంభించిన పవనన్న ప్రజా బాట కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజంపేట నియోజకవర్గంలోని పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని ఇంతటి విజయానికి సహకరించిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పీఏసీ చైర్మన్లు, పీఏసీ సభ్యులు, జనసేన నాయకులు ప్రతి నియోజకవర్గంలోనూ, నాయకుడిని గుర్తించి బాధ్యతలు చేబడితే పవన్ కళ్యాణ్ సీఎం రేసులో ముందుంటారన్నారు. రాజంపేట నియోజకవర్గం ద్వారా మనందరి ఆశయాలతో జనసేన నాయకత్వాన్ని తెలియజేసి పవన్ కళ్యాణ్ ను సీఎం కుర్చీలో కూర్చోబెడదామన్నారు. ప్రతి మండలంలోని జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్లి జనసేన జెండాను రాజంపేటలో ఎగరవేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చేసుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన పార్లమెంట్ ఇన్చార్జి ముకరం చాంద్, జనసేన యువనాయకులు అతికారి దినేష్, ఎం.వి.ఆర్ వెంకటేశ్వరరావు, లీగల్ సెల్ కత్తి సుబ్బరాయుడు, కరుణాకర్ రాజు, పోలిశెట్టి శ్రీనివాసులు, చిరంజీవి యువత రంజిత్ కుమార్, గుగ్గిళ్ళ నాగార్జున, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, జనసేన యువ నాయకురాలు పోలిశెట్టి రజిత, బండ్ల రాజేష్, పోలిశెట్టి చంగల్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.