వైసిపి ఫంక్షన్లో జనసేన నినాదాలు

ఎట్టకేలకు నాలుగు సంవత్సరాల తర్వాత కాపు భవన్ ప్రారంభోత్సవ సందర్భంగా వైసీపీ నేతలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి వచ్చిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ను చూడగానే యువత మరియు జనసేన మద్దతు దారులు జై జనసేన.. జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాపు భవన్ ప్రారంభోత్సవంగా ప్రముఖ కాపు నాయకుల చిత్రపటాలు కనపడకపోవడం హేయమైన చర్య. కోటి రూపాయలు విరాళం ఇచ్చి ఈ భవన నిర్మాణానికి కారణమైన పూర్వపు కాపు మంత్రి నారాయణ గారి పేరు గాని మరి ఇతర కాపు నాయకుల పేర్లు గాని శిలా ఫలకం లో వేయకపోవడం తప్పు. కాపులంతా పెద్ద మనసుతో నాయకత్వం ఎవరికి ఇచ్చినా సీట్లు ఎవరికి ఇచ్చినా పేద బలహీన వర్గాలందరిని కలుపుకొని జనసేన పార్టీకి అధికారం ఇచ్చే దిశగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారనే దానికి ఈ ఘటన నిదర్శనం. అంబటి రాంబాబు కాపు కులంలో ఎలా పుట్టాడో అర్థం కావడం లేదు, వేరొకరెవరినో సీఎం చేయటానికిక ఒక కాపు నాయకుడు ప్రయత్నిస్తున్నారని చెప్పడం నీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం. మహిళలు యువత దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రానున్నది జనసేన ప్రభుత్వం. ఐరన్ లెగ్ మాదాసు గంగాధరం స్టేజ్ పైన కూర్చొని జై జగన్ అనటం మర్యాద కాదు. అతను ఐరన్ లెగ్ కాబట్టి మీ పతనం ప్రారంభమైంది చూసుకోండి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర ఉండడంలో దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా మూలవేసిన కాపు భవాని ఓపెన్ చేసేసి మీ నాయకుల ఫోటోలు వేసేసి కాపులంతా మీతో ఉన్నారు అనుకోవడం, అలా చిత్రీకరణ కరించటం మీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ స్థిత ప్రజ్ఞతతో రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.