గొన్నబత్తుల రాజు ఆధ్వర్యంలో జనసేన వారాహి కోసం ప్రత్యేక పూజలు

గాజువాక: విశాఖ జిల్లా, విశాఖ పశ్చిమ నియోజకవర్గం, 92వ వార్డ్ లో గల గొన్నబత్తుల రాజు ఆధ్వర్యంలో మంగళవారం వారాహి పేరిట 108 నిమ్మకాయలు దండతో పాటు సింధూర అభిషేకం మరియు పంచామృతాభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పేతకం శెట్టి శ్యామ్ సుధాకర్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో 92వ వార్డ్ నాయకులు గొన్నబత్తుల అప్పలరాజు, కనకరాజు, జగన్ ఆనంద్, సాయిరాం, లత, నరేంద్ర, నాయుడు, శ్రీను, సురేష్, దివాకర్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.