118 సర్వే భూమిలో ప్లాట్లు చేసి ఇవ్వాలని డిమాండ్

భైంసా రజస్వ మండల అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భైంసా పట్టణంలోని 118 సర్వే లో దాదాపు 60 మందికి పైగా లబ్ది దారులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు వున్న లబ్ది దారులు వాళ్ళ భూమిలో వెళ్లి చూస్తే ఎలాంటి హద్దులు లేవు. దానితో లబ్ది దారులు ఆందోళన చెంది కొన్ని సంవత్సరాలుగా అధికారుల, ప్రజా ప్రతినిధులు చుట్టు తిరిగి అనేక రూపాల్లో వినతులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. నిరుపేదలైన వీళ్ళు కిరాయి ఇండ్లలో జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా భూమి సర్వేలో హద్దులు చూపించి న్యాయం చేయాలని కోరుతున్నాం. లేనియెడల పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు హాజరై వారికి మద్దతు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ది దారులు ప్రకాష్ పటేల్, రాణి, కమల, సరోజన, మహేష్, ఏకనత్, సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.