పాలకొండ జనసేన కార్యాలయంలో ఘనంగా 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పాలకొండ, జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు ఆదేశాల మేరకు గురువారం కేంద్ర కార్యాలయంలో ఘనంగా 11వ జనసేన నియోజకవర్గ నాయకులు కూరంగి నాగేశ్వరరావు సమక్షంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కూరంగి నాగేశ్వరరావు జనసేన పార్టీ జెండాను కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. కార్యకర్తలు అభిమానులు పాలకొండ నియోజకవర్గంలో జనసేన విజయకేతనం మోగిస్తుందని నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ 11 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో వడుదడుకులు ఎదుర్కుని పార్టీ బలంగా నిలబడిందని పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఆసియాలకు అనుగుణంగా పనిచేస్తామని నాగేశ్వరరావు అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన భవిష్యత్ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుందని, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటులో చాలా బలంగా పనిచేయడానికి పాలకొండ జనసేన కార్యకర్తలు సిద్ధమవుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల జనసైనికులు పాల్గొన్నారు.