జూన్ లో 12 కోట్ల డోసులు.. కేంద్రం

దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించింది. కేవలం జూన్ నెలలోనే 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రస్తుత మే నెలలో 7.9 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉండగా జూన్ లో ఈ సంఖ్య 12 కోట్లకు పెరగనుందని కేంద్ర ప్రభుతం స్పష్టం చేసింది.