సర్వేపల్లిలో జనంకోసం జనసేన 16వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లి పంచాయతీ లింగంగుంట నందు 16వరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అదివారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి పంచాయతీలోని 50 గిరిజన కుటుంబాలు లింగంగుంట గిరిజన కాలనీ నందు 50 ఏళ్ల పైబడి నివాసం ఉంటున్నారు వాళ్లకి ప్రధాన సమస్య స్మశానం స్మశానంగా వాడుకునే స్థలం చెరువు కట్టకి ఆనుకొని ఉండడంతో ఆ శివాయి స్థలనీ పొలాల్లో కలిపేసుకోవడం జరిగింది ఈ విషయంపై ఎన్నోసార్లు మండల స్థాయి అధికారులకి వినతి పత్రాల రూపంలో అందజేయడం జరిగింది వాళ్ళ స్మశాన స్థలం సమస్య ఇప్పటివరకు పరిష్కారమైన దాఖలు లేవు ప్రభుత్వాలు వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ల సమస్యలు ప్రభుత్వాలకి పట్టవు గిరిజనుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలంటే జనసేనతోనే సాధ్యఒ అదేవిధంగా 25 సంవత్సరాల క్రితం కట్టించిన కాలనీ ఇల్లు పెచ్చులు ఊడిపోతూ స్లాబులు ఉరుస్తూ ఇబ్బందులు పడుతుంటే కనీసం వాటికి మరమ్మతులు చేసిన దాఖలాలు కూడా లేవు ఈ విషయంపై ఎవరైనా ఏమైనా అడిగితే వాళ్ళని బెదిరిచ్చేటువంటి పరిస్థితి ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే జనసేన లక్ష్యం, ఆ లక్ష్యం వైపు మేమందరం అడుగులు వేస్తాం అని సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, చిన్న, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు.