నగర మేయర్‌గా 21 ఏళ్ల యువతి..

ఆర్యా రాజేంద్రన్..కేరళలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఆమె పేరే. తిరువనంత పురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 21 ఏండ్ల వయసులో పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అతి పిన్న వయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించారు. విపక్షాల నుంచి బలమైన అభ్యర్థిని బరిలో నిలిచినా ఆమె ముందు నిలవలేక పోయారు. ఈ విజయంతో అందరి దృష్టిని ఆమె ఆకర్షించింది.

కాగా తాజాగా మేయర్ అభ్యర్థిగా ఆమె పేరును అధికారిక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఖరారు చేసింది. దీంతో దేశంలో అతి పిన్న వయసులో మేయర్ పీఠాన్ని అధిరోహించబోతున్న యువతిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఎల్‌బీఎస్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. అంతే కాకుండా ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా పని చేస్తున్నారు.