ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలు, ప్రార్థన స్థలాలకు 25 లక్షల విరాళం ఆనందదాయకం: దూదేకుల కాసిం సైదా

గురజాల, ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలు, ప్రార్థన స్థలాలకు 25 లక్షలు రూపాయలు విరాళంగా అందించడం ఆనందదాయకమని జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల కాసిం సైదా హర్షం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విజయవాడ, మంగళగిరి, అమరావతికి చెందిన పలువురు ముస్లిం పెద్దలు ఉపవాస దీక్ష అనంతరం హైదరాబాదులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారని, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలు ప్రార్థన స్థలాలకు 25 లక్షల రూపాయలు విరాళంగా అందించి ముస్లిం నివాస ప్రాంతాల్లో మెరుగైన మౌళిక సదుపాయాల కల్పనకు జనసేన పార్టీ ప్రాధాన్యాత ఇస్తుందని చెప్పడం ముస్లిం సమాజంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని, ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరులు మన రాష్ట్రానికి అవసరమని రాబోయే రోజుల్లో ముస్లింలందరూ జనసేన పార్టీకి అండగా నిలబడి అధికారంలో రావడానికి కృషి చేస్తామని, అల్లా ఆశీస్సులు పవన్ కళ్యాణ్ పై ఉండాలని జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల కాశీం సైదా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, ఫేక్ మదీనా, షేక్ వలి, షేక్ అబ్దుల్ గపూర్, దూదేకుల కాసిం, దూదేకుల సైదవలి తదితరులు పాల్గొన్నారు.