ఎకరాకు 25,000 తక్షణ సహాయం అందించాలి: అవనిగడ్డ జనసేన పార్టీ

అవనిగడ్డ: మాండూస్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఉపశమనం కలిగించడానికి తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు ప్రభుత్వం అందించాలని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు డిమాండ్ చేశారు. అలాగే తేమశాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, రవాణా చార్జీలు, హమాలీ చార్జీలు రెట్టింపు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావం వల్ల శనివారం,ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన వరి పొలాలను, తడిసిపోయిన ధాన్యమును పరిశీలించడం కోసం శనివారం జన సైనికులతో కలిసి మండలంలోని ఆశ్వారావుపాలెం, మోదుమూడి, దక్షిణ చిరువోలులంక, రామకోటిపురం గ్రామాలలో పర్యటించారు. ఆరుగాలం కష్టించి రైతు పండించిన వరి వంట, కోత కోసే సమయానికి తుఫాను రావడంతో పూర్తిగా దెబ్బతిన్నదని, సాధారణంగా కోత కూలి ఖర్చులు ఒక ఎకరానికి 5000 రూపాయలు అయితే, వరి పంట నేలకొరిగి నీటిలో నానడంతో ఎకరానికి 10000 వరకు కూలీలు డిమాండ్ చేస్తున్నారని, అలాగే పడిపోయిన వరి కంకులను నిలబెట్టి కట్టలు కట్టడానికి మరొక 4000 రూపాయిలు అవుతున్నాయని, ఒక ఎకరం సాగు చేస్తే రైతుకు మిగిలేది పదివేల రూపాయలు అనుకుంటే తుఫాను కారణంగా ఖర్చులు పెరిగి రైతు నష్టపోతున్నాడు కాబట్టి ప్రభుత్వం స్పందించి తక్షణ సహాయం కింద 25 వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. అలాగే తేమ శాతం 17 పాయింట్లు ఉంటే మాత్రమే రైతు భరోసా కేంద్రాలలో ప్రభుత్వం ప్రకటించిన ఒక క్వింటా ధాన్యానికి 2040 ఇస్తున్నారని, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తేమశాతం 20 పైగా ఉంటుందని దీని కారణంగా మిల్లర్లు రేటు పూర్తిగా తగ్గించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారని ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తేమ శాతంతో సంబంధం లేకుండా అందరికీ మద్దతు ధర ఇవ్వాలని ఈ విధంగా రైతులను ఆదుకోవాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. అలాగే రవాణా చార్జీలు ఒక టన్నుకి 500 రూపాయలు ఇస్తున్నారని, హమాలీ చార్జీలు ఒక టన్నుకి 560 రూపాయలు ఇస్తున్నారని ఇవి ఏమాత్రం సరిపోవటం లేదని స్థానిక ఎమ్మెల్యే వెంటనే కలగజేసుకుని ఇవి రెట్టింపు చేయాలని జనసేన తరఫున నాయకులు కోరారు.
అలాగే ఈ క్రాప్ ద్వారా పంట నమోదు చేయటం జరిగినందున తద్వారా వచ్చే ఇన్సూరెన్స్ కూడా రైతులకు అందేలా అధికారులు కృషి చేయాలని జనసేన నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో బచ్చు వెంకటనారాయణ, బచ్చు మురళి, నరేష్ కమతం, బచ్చు శ్రీను, తుంగల నరేష్, బచ్చు ప్రశాంత్, బచ్చు శ్రీహరి, మండలి శివప్రసాద్, బొప్పన పృద్వి, రేపల్లె రోహిత్, నాగభూషణం, పప్పు శెట్టి శ్రీను, ఆకుశెట్టి రవి, కమ్మిలి సాయి భార్గవ, బాలు, పవన్ కళ్యాణ్, గణేష్, గోపాలకృష్ణ, అప్పికట్ల శ్రీ భాస్కర్, రైతులు పాల్గొన్నారు.