Nandigama: కె.వి.ఆర్ విద్యార్థుల పోరాటానికి జనసేన సంఘీభావం

ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలి – కె.వి.ఆర్ విద్యార్థుల పోరాటానికి జనసేన సంఘీభావం.

కృష్ణాజిల్లా, నందిగామ నియోజకవర్గం పాదయాత్ర కాలంలో ఎన్నోమార్లు, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను సొంత మేనమామలా ఆలనా పాలనా చూసుకుంటానని హామీలు గుప్పించిన శ్రీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా విధానాలపై పరిపక్వతలేని నిర్ణయాలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది. వారి ఆర్ధికస్తోమతను బట్టి వారు ఎంచుకుని చేరిన ఎయిడెడ్ విద్యాలయాలను ఏమాత్రం ఆలోచన లేకుండా ఒక పిచ్చి నిర్ణయంతో వారందరినీ అగాధంలోకి నెట్టేసారు. ఆయా విద్యాలయాల పాలకవర్గాలు నేడు విధించే ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రుల అవస్థలు వర్ణనాతీతం. గత సంవత్సరం డిసెంబర్ నెలలో GO నెంబరు 177 ను తీసుకు వచ్చి ప్రయివేటు మరియు ఎయిడెడ్ కాలేజీ విద్యార్థులకు నవరత్నాల హామీలో భాగమైన ఫీజు రీయింబర్సుమెంటును ఎత్తేసి విద్యార్థుల బంగారు భవిష్యత్ మీద దెబ్బ కొట్టారు నేడు కనీసం వారు ఎంచుకుని చేరిన ఎయిడెడ్ పాఠశాలలు , కళాశాలలు ప్రయివేటుపరం చేసి పేద, దిగువ, ఎగువ మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులను అంధకారంలోకి నెట్టేశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభత్వ నిరంకుశ నిర్ణయాన్ని నందిగామ నియోజకవర్గ జనసేనపార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన పాలకపక్షం ఇటువంటి అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను పునరుద్దరించి పేద, మధ్య తరగతి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, సుమారు అయిదు దశాబ్దాల పైబడి నందిగామ నియోజకవర్గంలో లక్షలమంది విద్యార్థులను తీర్చిదిద్దిన కె.వి.ఆర్ కళాశాలను సైతం ప్రయివేటుపరం చేయడం ఎంతో విచారకరం. నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య దశాబ్దాలుగా తీరని సమస్యగా ఉన్నా పేద , మధ్య తరగతి ప్రజల పిల్లలకు అందుబాటులో, ఉన్నత విద్య ప్రమాణాలను అనుసరించి లక్ష పై చిలుకు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన కె.వి.ఆర్ కళాశాలకు తక్షణమే ప్రభత్వ కాలేజీగా గుర్తింపును కలుగజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ మొండితోక జగన్మోహనరావు గారిని కోరుతున్నామని కృష్ణాజిల్లా జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి స్వరూప పుట్టా తెలిపారు.