సర్వేపల్లిలో జనం కోసం జనసేన 28వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం: ముత్తుకూరు మండలం, బండ్లపాలెం నందు ఆదివారం జనం కోసం జనసేన 28వ రోజు కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉభయగోదావరి జిల్లాలో జనసేన వారాహి విజయ యాత్ర విజయవంతంగా కొనసాగి ప్రజల్లో పెరిగిన ఆదరాభిమానం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో కూడా ఒక స్థాయిని స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఓర్వలేక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన సిబిఐ దత్తపుత్రుడు మా అధినేతని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మనం మాట్లాడితే ఏ విధంగా మనం బురద జల్లితే ప్రజల మనసులని మార్చొచ్చు, ఆయన మీద అభిమానాన్ని తగ్గించొచ్చు అనే ఆలోచనతో ఉన్నట్టున్నాడు మేం ఒకటే చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల గుండెల్లో ఒకసారి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ముద్రని ఎవరు కూడా తొలగించలేరు. అదేవిధంగా మీరు మీ సాక్షి టీవీ, మీ సాక్షి పేపర్, మీ తప్పుడు యూట్యూబ్ ఛానల్స్ తో మా అధినేతని ఆయన చేస్తున్న పోరాటాలని వరాహి విజయ యాత్రని ఏ విధంగా కూడా అడ్డుకోలేరు. అదేవిధంగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల దృశ్య ఆయన ఏసే ప్రతి అడుగు కూడా నీతి నిజాయితీగా నిక్కచ్చిగా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి రేపు 2024లో ప్రజలే మీకు చెప్పుతో కొట్టి ఇళ్ళకి తరిమే రోజులు త్వరలోనే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రెండవ దశ ఈరోజు నుంచి వారాహి విజయ యాత్ర ఏలూరు నందు మళ్లీ ప్రారంభమవుతుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ జనాలని బిరియాని ప్యాకెట్ ఒక కోటర్ ముందు 3500 ఇచ్చి తోలించుకోవట్లేదు ఆయన మీద అభిమానంతో ఆయన పరిపాలన బాగుంటుంది నీతి నిజాయితీగల నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గమనించి ఈ రోజు ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, తండోపతండాలుగా నిస్వార్ధంగా వచ్చి నిలబడుతున్నారు. మీ 151 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 22 మంది మంత్రులు కావచ్చు మీరు ఈ రోజు మా అధినేతకి ప్రజల్లో పెరిగిన అభిమానం కావచ్చు రాష్ట్రవ్యాప్తంగా ఆయనకి పెరిగిన గ్రాఫ్ ని చూసి తట్టుకోలేక అల్లాడిపోతున్నట్టున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఐస్ క్రీమ్స్ పెట్టుకోండి ఆ మంటను తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు అలా తగ్గించుకో లేకపోతే మేమే తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ముత్తుకురు మండల నాయకులు రహీమ్, ఖాజా, బొల అశోక్, బొల అజయ్, వెంకటేష్, సుమన్, మల్లి, దినేష్, వేణు, శ్రినయ్యా, తదితరులు పాల్గొన్నారు.