నందికొట్కూరులో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కు దారేది 2వ రోజు నిరసన

నందికొట్కూరు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఆదివారం రోడ్ల దుస్థితిపై జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఆందోళన కార్యక్రమంలో భాగంగా పారుమంచాల నుండి తుడిచెర్ల వెళ్లే రోడ్డు మార్గంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగినది. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు నల్లమల రవికుమార్ మాట్లాడుతూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రోడ్లపై విమర్శలు చేస్తూ ఉంటే కనీసం స్పందించని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి కళ్ళు తెరవాలని, తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేయించారని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక కనీసం రోడ్లకు ప్యాచీలు కూడా వేయట్లేదని విమర్శించడం జరిగింది. అలాగే మద్యపాన నిషేధం చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, నిత్యవసర సరుకుల ధరలు పెంచి ప్రజలను మరింత ఇబ్బందికి గురి చేశారని, ఇసుక దందాల వల్ల పేద ప్రజలు కనీసం వసతి గృహాలు కట్టించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్తు బిల్లులు పెంచి రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని తెలియజేయడం జరిగింది. అలాగే జూపాడు బంగ్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దాదాపు పది పల్లెలకు పైగా వెళ్లే ఈ రహదారి పరిస్థితి ఈ రకంగా ఉంటే చిన్న చిన్న పల్లెటూర్ల రహదారులు ఏ విధంగా ఉంటాయి అని విమర్శించడం జరిగింది. అలాగే పల్లెటూర్లల్లో రహదారులు వేయాలంటే జడ్పిటిసి నిధులు ఇవ్వచ్చు లేదా ఎమ్మెల్యే నిధులు ఇవ్వచ్చు లేదా గ్రామపంచాయతీ నిధులు కూడా ఉపయోగించుకోవచ్చు కానీ ఇవి ఏవి ఉపయోగించకుండా రహదారుల గురించి పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అని విమర్శించడం జరిగింది. రోడ్డు మార్గంలో తిరిగే ప్రతి ఒక్క ప్రయాణికుడికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. కనుక 2024లో జనసేన తెలుగుదేశం కలిసికట్టుగా పోరాడి అధికారంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నుండి మధు బాలరాజు, శ్రీనివాసులు నరేష్, రాజు, తరుణ్, రాజేష్, ప్రదీప్ కుమార్, బాలకృష్ణ, శ్రీనివాసులు, నాగన్న, రామాంజనేయులు, బాలఏసు, నాగలింగప్ప, తెలుగు దేశం నుండి కాగుల శంకర్ యాదవ్, వడ్డే శంకర్, చిన్న దస్తగిరి, భూపనపాటి పుల్లయ్య మధురయ్య, మహమ్మద్ హుస్సేన్, చాకలి శ్రీనివాసులు, చాకలి నాగార్జున, వడ్డే విభూదయ్య తదితరులు విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.