ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు

  • గిరిజన ఐక్యతకు చిహ్నంగా వివిధ రంగాల్లో సేవచేసిన ఆదివాసీ మాతృమూర్తులకు ఘన సన్మానం
  • గిరిజన ఖ్యాతిని పెంచేలా తమ గిరిజన జాతికి విశిష్ట సేవలందించిన గిరిజన పెద్దలకు ఘనసన్మానం

పాడేరు నియోజకవర్గం: అల్లూరీ జిల్లా ప్రధాన కేంద్రంలో పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అరకు వ్యాలీ, పాడేరు నియోజకవర్గాలలో వివిధ మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్బంగా జనసేన అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య ప్రసంగిస్తూ ప్రపంచ ఆధివాసీ దినోత్సవం సందర్బంగా అల్లూరిజిల్లా ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నారు. గిరిజన ద్రోహులైన వివిధ నాయకులకు, రెండు ప్రధాన పార్టీలకు ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు మన ప్రాంత గిరిజనప్రజలకు తెలియజేసే నైతిక విలువలున్నాయా? అని ప్రశ్నిస్తున్నాం. ఒక వైపు గిరిజన హక్కులు, చట్టాలు ప్రభుత్వం కాలరాస్తుంటే వత్తాసు పలికినది మీరు కాదా?.. ఇది రక్షించే పాలకులే భక్షించారనేది వాస్తవం కాదా?.. ఇంకో వైపు గిరిజన ప్రాంతపు సహజ సంపద కార్పోరేట్ శక్తులకు ప్రభుత్వం ధారాదత్తం చేస్తుంటే మీరు ఏవిధమైన ప్రతిచర్యగా స్పందించడం చేయకపోగా వారితో ములాకాత్ అయ్యింది నిజం కాదా? అయితే పదవుల కోసం గిరిజన అస్తిత్వాన్ని నాశనం చేయాలనుకోవడం మీ దుర్మార్గపు రాజకీయాలకు పరాకాష్ట కాదా అని ప్రశ్నిస్తున్నాం అన్నారు. గిరిజనులపై బోయా, వాల్మీకి కులాలను ప్రభుత్వం కలపాలనుకుంటే మీరెందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. జాతి ద్రోహానికి ఒడిగాడుతున్నామనే కనీస భావన మీకు కలగలేదా?ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆదివాసీ ప్రజలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారో? ఈ కుట్ర, మోసపూరిత రాజకీయాలకు ఎవరు బలైపోతున్నారో అధివాసీలందరికి తెలుసని ప్రభుత్వ గిరిజన ప్రతినిధులపై తీవ్ర విమర్శలు చేసారు. అలాగే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా గిరిజన జాతికి చెందిన వివిధ ఉపకులాల మహిళలకు, మాతృమూర్తులకు వారు చేసినటువంటి సేవలకు గాను సన్మానం చేశారు. వీరిలో దొర్ర జమ్మి ఆశ కార్యకర్తగా విధినిర్వహన చేస్తూ తన సొంత ఖర్చుతో గ్రామస్తులకు రోడ్డు సదుపాయం కల్పించారు. అందుకుగాను ఆమెను సన్మానించారు. ఆమె చేసిన సేవలు గిరిజన జాతికి తెలియజెయ్యాల్సిన బాధ్యత జనసేన పార్టీ చేస్తుందని అన్నారు. అలాగే ఒకప్పటి రాష్ట్రపతి మహనీయులు మిస్సైల్ మ్యాన్ దివంగత నేత ఏపీజే అబ్దుల్ కలామ్ గారికి తన మూలికా వైద్యంతో చికిత్స చేసి మందు పంపిణీ చేసి సేవ చేసినటువంటి గిరిజన ముద్దుబిడ్డ కొర్ర కృష్ణారావు వంటి గిరిజన ఆయుర్వేదిక్ వైద్యులు వారికి ఘనంగా సన్మానం చేస్తూ మన పూర్వీకులు తమ వంతు సేవ దృక్పధంతో చేస్తున్న సేవలకు గాను ఇటువంటి అరుదైన గిరిజన పెద్దలను గౌరవించుకోవల్సిన నైతిక బాధ్యత మనపై ఉందని గంగులయ్య తెలిపారు. మనం మిగతా పార్టీల నాయకులవలె ప్రజాధనం వృధా చేస్తూ హంగు ఆర్భాటాలు చేయలేమని జనసేన పార్టీ ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను రక్షించుకుంటూనే వివిధ గిరిజన ఉపకులాల ప్రజల మధ్య ఐక్యతకు జనసేన పార్టీ ఏ విదంగా కట్టుబడి ఉంటుందో అందుకు నిదర్శనమే నేడు మన ఆదివాసీ దినోత్సవం చేసుకున్నామన్నారు. అరకు నియజకవర్గ ముఖ్య నాయకులు, పాడేరు నియోజకవర్గ ముఖ్య నాయకులు ఏజెన్సీ ప్రాంతంలో వివిధ మండలాల ముఖ్యనాయకులందరు పాల్గొన్నారు. లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, వీరమహిళలు కిటలంగి పద్మ, బొంకుల దివ్యలత వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.