వాలంటీర్స్ ద్వారా 3లక్షల మంది వ్యక్తగత డేటా చోరీకి గురైంది

  • జనసేన జిల్లా కార్యదర్శి దేవర మనోహర్

చంద్రగిరి: జనసేన జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ చంద్రగిరి ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసారు. ఆదివారం జనసేన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్స్ ద్వారా 3లక్షల మంది వ్యక్తగత డేటా చోరీకి గురైందన్నారు. రాజముద్ర వేసి ఉన్న ఎమ్మెల్యే సమాచార సేకరణ పత్రాన్ని మనోహర్ మీడియా ఎదుట పెట్టి, నగదు, బంగారం వివరాలు తప్ప సున్నితమైన డేటాను హ్యాబిటేషన్ వారిగా చోరీ చేశారని మనోహర్ పేర్కొన్నారు. డేటా మొత్తాన్ని హైదరాబాద్ నానక్ రామగూడలోని వర్ర రవీంధ్రకు చెందిన ఎఫ్.ఓ.ఏ కంపెనీ చేతిలో పెట్టారు. అక్కడ నుంచి ఈ డేటా సంఘ విద్రోహక శక్తుల చేతుల్లోకి వెళుతోందని తెలిపారు. ప్రాధమిక హక్కులను ఉల్లంఘించడం లేదా..? ఆర్టికల్ 21 ప్రకారం బాద్యులు కారా..?, 175 నియోజకవర్గాల్లో ఎక్కడా జరగని విధంగా చంద్రగిరిలో డేటా చోరీ జరిగింది. సెక్షన్ 411, 454, 456, 504, 506 ప్రకారం ఎమ్మెల్యే శిక్షార్హుడు. యుఐడి, గవర్నర్, ఎన్.హెచ్.ఆర్.సి, హైకోర్టు చీఫ్ జస్టిస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలాంటి సమాచారం లేకుండా ఇంత భారీ ఎత్తున డేటా చోరికి పాల్పడుతున్న ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలని మనోహర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మండల అధ్యక్షుడు సంజీవ్ హరి, తిరుపతి అర్బన్ మండల అధ్యక్షుడు కిషోర్ రాయల్ మరియు జనసేన నాయకులు జనసేనలో పాల్గొన్నారు.