3 ఫేస్ వైరు ఏర్పాటు చేయాలి

  • కోటనందూరు పంచాయతీ సెక్రటరీ

తుని నియోజకవర్గం: కోటనందూరు మండలం, కోటనందూరు మెయిన్ సెంటర్లో స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని కోటనందూరు పంచాయతీ సెక్రటరీ జూన్ 28న, ఒక వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను, అంతే కాకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది, కాకినాడ డి.పి.ఓ కి ఈ సమస్యను పరిష్కారం చేయాలని మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా ఒత్తిడి చేయడం వల్ల, 3 రోజుల్లో ఆ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా, లైట్లు వేయడం జరిగింది. శాశ్వత పరిష్కారం కోసం ఒక వారం రోజులు గడువు అడిగారు. లైట్లు వేసినా, ఈ సమస్య శాశ్వత పరిష్కారం కాలేదు. అక్కడ మెయిన్ రోడ్ అంతటా 3 ఫేస్ కరెంట్ లైనుకి వైరు వేసి ఇంకా 5 లైట్లు వేయాలి, దానికి ఎలక్ట్రికల్ ఏ.ఈ, పంచాయతీ వారు లెటర్ ఇస్తే, ఆ 3 ఫేస్ లైను కి ఎస్టిమేషన్ వేసి, డి.ఈ అనుమతి తీసుకొని, శాశ్వత పరిష్కారం చేస్తాను అని తెలిపారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తికావడానికి వారం రోజులు అడిగారు. సమస్య వస్తే, ఆ సమస్య పరిష్కారం అయ్యేవరకు నా వంతు నేను కృషి చేస్తాను. ఇదే నా నాయకుడు పవన్ కళ్యాణ్ నా నుంచి కోరుకునేది, ఆయనే నాకు పోరాట స్ఫూర్తి అని కోటనందూరు పంచాయతీ సెక్రటరీ, డిపిఓ, కోటనందూరు ఎలక్ట్రికల్ ఏఈ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.