ఆత్మకూరులో పవనన్న ప్రజాబాట 30వ రోజు

ఆత్మకూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 30వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా గురువారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జూనియర్ కాలేజ్ రోడ్డు, క్రిస్టియన్ పేట, ఎరుకలసాని నగర్ ప్రాంతాలలో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని, జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా ఎరుకల సాని నగర్ లోని పందుల పెంపకం దారులు తమ ఆవేదనను తెలియజేయడం జరిగింది. పందుల పెంపకం దారులకు చెందిన సుమారు 12 లక్షల విలువచేసే పందులను మున్సిపల్ అధికారులు తరలించుకుపోయారని, వాటి మీద జీవనాధారం సాగిస్తున్న మా పరిస్థితి ఏమిటని పందులు పెంపకం దారులు వాపోయారు. పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచే క్రమంలో మున్సిపల్ పరిధిలో పందులను అరికట్టడం అవసరమైనప్పటికీ, పందుల పెంపకం దారులకు సరైన ప్రత్యాన్మాయాన్ని కల్పించవలసిన బాధ్యత కూడా మున్సిపల్ అధికారులకు ఉంది అని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. ఇప్పటికైనా పందుల పెంపకందారులకు సరైన ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. సకల సౌకర్యాలతో, ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు చంద్ర, నాగరాజు, తిరుమల, అనిల్, హరిబాబు, హజరత్, తదితరులు పాల్గొన్నారు.