ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 31వ రోజు పాదయాత్ర

ఏలూరు నియోజకవర్గంలో మేము చేపట్టిన ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటకు విశేష స్పందన లభిస్తుందని రెడ్డి అప్పల నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల మీద అనునిత్యం పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పాలనా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతి రహిత సమాజ స్థాపన కోసం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆదివారం స్థానిక 26 వ డివిజన్ శనివారపుపేటలోని గాలిగోపురం వద్ద నుండి మాలపల్లి, హై స్కూల్ ఏరియాలో సుందరనీడి వెంకట దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పాదయాత్రను జననీరాజనాల నడుమ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో నిర్విరామంగా పోరుబాటను నిర్వహిస్తున్నామన్నారు. 26వ డివిజన్ లోని ప్రజలకు జనసేన పార్టీ సిద్దాంతాలను, ఆశయాలను వివరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని కోరారు. ప్రతి గడప వద్ద ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తున్నారన్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో కుంటి సాకులు చెప్పి పథకాలను తొలిగిస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలన్నా, ఆంధ్ర రాష్ర్టం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉపాధి కలగాలన్న జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని రెడ్డి అప్పల నాయుడు ధీమా వ్యక్తం చేశారు. శనివారపు పేటలోని హైస్కూల్ రోడ్డులో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందడం లేదు. కుంటి సాకులు చూపించి అర్హులైన వృద్ధులకు పెన్షన్లను తొలగిస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే అని, రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతి సమస్యపై స్పందించిన తీరు విధానంపై ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దూషించుకోవడమే తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా పాలనా యంత్రాంగం మరుగున పడేలా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదని పరిశ్రమలు స్థాపన చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగంలేక పరాయి రాష్ట్రాలకు తరలి పోతున్నారు. ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తున్నామని గొప్పలకు పోయి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి జగన్ రెడ్డి ప్రభుత్వం నెట్టివేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు పరచాలంటే రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి. కానీ ఏ ప్రక్కన చూసిన అప్పులే తప్ప ఆదాయంలేని రాష్ట్రంగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జనసేన నాయకులు శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు, బుధ్ధ నాగేశ్వరరావు, సురేష్, గోపి, పొన్నూరు రాము, శివ, దుర్గారావు స్థానిక నాయకులు గెడ్డం చైతన్య, సుందరనీడి శివశంకర్, తోట దుర్గా ప్రసాద్, జిల్లెల ప్రియాంక, తోట రాజేష్, బత్తుల రాంబాబు, దారుగ చంద్రశేఖర్, కర్రి మంగరాజు, వాసా సాయి, ఈశ్వర్, సూర్య కుమార్, జవ్వాది కృష్ణ, సమ్మెట్ల కృష్ణ, కర్రి వెంకన్న, వై.రాముడు, దాడిశెట్టి సూర్య రావు, కెంగువ సూరి, మావుళ్ళ ధర్మాయాదవ్, కొండేటి రమేష్ వీర మహిళలు కావూరి వాణిశ్రీ, సరళ, ఉమాదుర్గ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.