జనంకోసం జనసేన 320వ రోజు

  • వనరక్షణలో భాగంగా 900 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 320వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం, గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 900 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 81395 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల రైతు కమిటీ ఉపాధ్యక్షులు రౌతు పైడియ్య, గోకవరం మండల కార్యదర్శి ఈలి దొరబాబు, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి ఓరుగంటి సాయి, గుమ్మళ్ళదొడ్డి గ్రామ అధ్యక్షులు చక్కిడాల జ్యోతి స్వరూప్(పండు), గ్రామ బిసి సెల్ అధ్యక్షులు ఆడారి మల్లేశ్వరరావు, గ్రామ కార్మిక కమిటీ అద్యక్షులు ఆడారి వీరబాబు, గ్రామ యువత అధ్యక్షులు కోట మాధవ ప్రకాష్, గ్రామ సంయుక్త కార్యదర్శి పెంటకోటి వెంకట అప్పారావు, గ్రామ సంయుక్త కార్యదర్శి వేగి అప్పలరాజు, మెప్పేల శివ, కుమ్మరి బద్రి, వీరలంకపల్లి నుండి సుంకర తాతారావు, అచ్యుతాపురం నుండి లక్ష్మి నాగేశ్వరరావు, నల్లల బులబ్బాయి(నాని), బండారు శ్రీను, పాలూరి రాజు, కొత్తపల్లి నుండి పువ్వల శ్రీదేవి, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా వెదురుపాక గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కామిసెట్టి సత్యప్రసాద్ కుటుంబ సభ్యులకు, బావాజీపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన తాళ్ళపురెడ్డి లక్ష్మణరావు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.