కేర‌ళ‌లో ఒక్క‌రోజులో 32,803 క‌రోనా కేసులు.. దేశంలో కొత్త‌గా 47,092 కేసులు

దేశంలో నిన్న కొత్తగా 47,092 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,28,57,937కి చేరింది. అలాగే, నిన్న 35,181 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 509 మంది మృతి చెందారు.

దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,39,529కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,20,28,825 మంది కోలుకున్నారు. 3,89,583 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. అలాగే, నిన్న 81,09,244 డోసుల వ్యాక్సిన్ల వేశారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 66,30,37,334 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 32,803 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 173 మంది ప్రాణాలు కోల్పోయారు.