9 వేల కోట్లతో ఇళ్లు: కేటీఆర్

పీవీ మార్గ్‌, అంబేద్కర్ నగర్‌లో… 330 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక్క పైసా తీసుకోకుండా సీఎం ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు. ఇల్లు కట్టాలన్న, పెళ్లి చేయాలన్న కష్టంతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ఇల్లు కట్టించి ఇచ్చి.. ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా నిలుస్తున్నారని కేటీఆర్ తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంతో కాలనీల్లో మార్పు వచ్చిందన్నారు. పేదల కోసం ఇళ్లు కట్టించి ఇస్తున్న కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.9 వేల కోట్లతో ఇళ్లు కట్టించి ఇస్తున్నామన్నారు. పారదర్శకంగా ఇళ్ల పంపిణీ జరుగుతుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని కేటీఆర్ పేర్కొన్నారు.