చెత్తపన్నును వ్యతిరేకిస్తూ 34వ వార్డు జనసైనికుల ప్రచారం

విశాఖ, దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు జనసైనికులు చెత్తపన్నును వ్యతిరేకిస్తూ ప్రచారం మొదలు పెట్టారు. దీనికి వార్డు ప్రజలు చెత్తపన్ను కట్టడం మాకు ఇష్టం లేదని వాలంటీర్లతో బలవంతంగా పధకాలు ఆపేస్తామని చెప్పి బెదిరించి కట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ముందు ఈ వాలంటీర్లను జనాలు చితకబాదాలి డబ్బులుకు అమ్ముడుపోయి ఓటుకి డబ్బులు పంచుతున్నారు. ఇప్పుడు జనాలు మీద పడి దోచుకుంటున్నారని అన్నారు. ఆదివారం ప్రజలు కోసం జనసేన బ్యానర్ తో ప్రజల పక్షాన అండగా నిలిచిన నీలం రాజు, వాసుపల్లి నరేష్, లుక్స్ గణేష్, నడుపూరి లక్ష్మణ్, ఉమ్మిడి గురుమూర్తి, పుక్కళ్ల బద్రి మరియు కుందు ప్రసాద్, బలగ శ్రీను లు పాల్గొన్నారు.