రాజకీయ అజ్ఞాని ద్వారంపూడీ.. నీ ప్రగల్బాలు కట్టిపెట్టు

పెడన, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభతో వైసీపీ నాయకులకు వేసవి కంటే ముందుగానే వడ దెబ్బ తగిలింది. ఒక్కొక్కరికి మైండ్ పని చేయక పవన్ కళ్యాణ్ పై పసలేని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అహంకారి, నైతిక విలువలు లేని రాజకీయ బ్రోకర్, రాజకీయ అజ్ఞాని నీలాంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదు. నువ్వు ఆటలో అరటిపండువి నీ వల్ల ఏమవుతుంది ద్వారంపూడి. వచ్చే ఎన్నికల్లో నీకు సీటు వచ్చే పరిస్థితి లేదని బయట వినికిడి. ఒకవేళ వచ్చినా నిన్ను అసెంబ్లీకి వెళ్ళకుండా ద్వారాలు మూసె పనిలో జనసైనికులు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నిన్ను ఇంటికే పరిమితం చేసే బాధ్యతలు జనసైనికులుగా మేం తీసుకుంటాం. ప్యాకేజీ అని మొరిగే ఊర కుక్కలకు మేము ఇచ్చే బంపర్ ఆఫర్ ఒక్కటే. మీది నికార్సైన పుట్టుకే అయితే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నట్టు నిరూపించండి. లేనియెడల మీ పుట్టుక పై ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుమానాలు లేవనెత్తి పరిస్థితి ఏర్పడుతుంది. గత పంచాయతీ ఎన్నికల్లో, తర్వాత జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుండి ఎంతోమంది సామాన్యులు ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్దిన పార్టీ జనసేన. పవన్ కళ్యాణ్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఒక శక్తి, ఒక వ్యవస్థ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే దిక్సూచి. భావి తరాల భవిష్యత్తుకు ఆశాజ్యోతి. ఇలాంటి పవన్ కళ్యాణ్ పై ఉండే గౌరవం, నమ్మకం అభిమానం నీలాంటి అల్పులకు అర్థం కాదు. తుది శ్వాస వరకు ప్రతి జనసైనికుడు పయనం పవన్ వెంటే. గజరాజును చూసి ఊర కుక్కలు మొరగటం, మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ చూసి మీ లాంటి పిచ్చి కుక్కలు అరవటం రెండు ఒకటే. మిస్టర్ ద్వారంపూడి నీకు రాజకీయ సమాధి కట్టే బాధ్యతను జనసైనికులు తీసుకున్నారు. ఒక్కో ఇటుకను సమకూర్చుకునే పనిలో జనసైనికులు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.