కొరియర్ లో 38 లక్షల 64 వేల రూపాయల విదేశీ కరెన్సీ..చెన్నైలో పట్టివేత

విదేశీ కరెన్సీను విబిన్న తరహా లో ఇండియా నుంచి పంపిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఓ ప్రబుద్ధుడు. అది కూడా ఎలాగో తెలుసా.. వింటే ఆశ్చర్యపోతారు. ప్రత్యేకంగా మౌల్డ్ చేసిన 25 చిన్న చిన్న స్టీల్ ప్లేట్లలో విదేశీ కరెన్సీని అమర్చాడు.  40 వేల జీబీపీలు. అంటే ఇండియన్ రూపీస్ లో 38 లక్షల 64 వేల రూపాయలు. ఇలా అమర్చినదాన్నికొరియర్ పార్శిల్ ద్వారా సింగపూర్ కు తరలించాలనుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ శాఖకు అడ్డంగా దొరికేసింది ఈ పార్శిల్. కస్టమ్స్ చట్టం ఫెమా కింద ఈ పార్శిల్ ను సీజ్ చేశారు. పార్శిల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.