యాదిరెడ్డి పల్లిలో 39వ రోజు పాదయాత్ర

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, 39వ రోజుగా తాడుర్ మండలం, యాదిరెడ్డి పల్లి గ్రామంలో, తాడుర్ టౌన్ లో వంగ లక్ష్మణ్ గౌడ్ నియోజకవర్గ నాయకులతో కలిసి గ్రామంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలు డబుల్ బెడ్ రూములు, ఇంటికొక ఉద్యోగం, దళిత బంధు, రైతు బంధు రైతులకు రుణమాఫీ ఇవన్నీ ఎక్కడా అందట్లేదు. తాడుర్ లో ఎస్సి వాడలో మురికి నీళ్ళు కూడా శుభ్రం చేయలేని పరిస్థితి, భర్త చనిపోయిన వృద్ధులకు పించన్ ఇవ్వలేని దుస్థితి, వృద్ధులకు సరైన సమయంలో పించన్ అందట్లేదు, కొందరికి 2నెలలకు ఒకసారి పించన్ అందుతుంది. ఈ సమస్యలన్నీ పోవాలంటే, పాలన మారాలి, బహుజనులంతా ఏకం కావాలి. గాజు గ్లాసు గుర్తుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. అధికార మదంతో ప్రజలను మభ్య పెడుతూ, వారి పబ్బం గడుపుతున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బహుజనులంతా నడుంబిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు గోపాస్ కుర్మన్న, సూర్య, పెరుమళ్ల శేఖర్, వంశీ రెడ్డి, ఎడ్ల ప్రసాద్, ఎడ్ల రాకేష్, పూస శివ, భాస్కర్, మహేష్, సందీప్, రవి, అశోక్, సతీష్, శివ, రాజు, రమేష్, శివ కుమార్, ఎం.డి ఆరిఫ్, దర్మి తదితరులు పాల్గొన్నారు.