హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రికి రోడ్ల దుస్థితి ఎలా తెలుస్తుంది

  • జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు, మూడేళ్ళ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా పక్క పక్క ఉన్న ప్రదేశాలకు సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ లోనే ప్రయాణిస్తున్నారని, ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రికి అడుగుకో గుంత, గజానికో గోయి ఏర్పడ్డ రహదారుల దుస్థితి ఎలా తెలుస్తుంది అంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో భాగంగా మూడోరోజు ఇస్కాన్ టెంపుల్ ప్రధాన రహదారిలో రోడ్లను పరిశీలించారు. అద్వాన్నంగా ఉన్న రోడ్లను ఫోటోలు తీసి అప్పటికప్పుడు ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జూలై 15 కల్లా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేసి వాటి ఫొటోలతో ఎగ్జిబిషన్ పెట్టాలని సీఎం అధికారులను శాసించారని, అయితే 15 తరువాత రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయమైన రోడ్లను జనసేన తీసిన ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే ప్రజలకు మరిన్ని వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఎక్కడన్నా అతివేగంగా వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని, రాష్ట్రంలో మాత్రం పాడైపోయిన రోడ్లపై ప్రయాణిస్తేనే ప్రమాదాలకు గురవుతున్నారని విమర్శించారు. మహిళా కో ఆర్డినేటర్ పార్వతీ నాయుడు మాట్లాడుతూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకోవడం, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే హెలికాప్టర్ లో తిరగటం మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు పట్టించుకునే తీరిక లేదని దుయ్యబట్టారు. ఇంటినుంచి బయటికి వెళ్లిన వాళ్ళు ఎలాంటి దెబ్బలు తగలకుండా తిరిగి ఇంటికి వచ్చారు అంటే ఆ రోజుకు గండం గడిచినట్లే అని భావించేలా వైసీపీ పాలన సాగుతుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రాష్ట్ర దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, నగర కార్యదర్సులు భూషయ్య లక్ష్మీశెట్టి నాని, దాసరి వెంజటేశ్వర్లు, ఫణీంద్ర శర్మ, రవి, కిరణ్, జడ సురేష్, లెనిన్, బాలు శిఖా, షర్ఫుద్దీన్, సుబ్బారావు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.