జనజాగృతి యాత్ర 49వ రోజు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం పరిజర్లపేట గ్రామంలో 49వ రోజు జనసేన జనజాగృతి యాత్ర ప్రజాదరణతో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ని చూడడమే లక్ష్యం అన్నారు. ప్రతి ఇంటికి వెళ్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను, షణ్ముఖ వ్యూహం కరపత్రాలను, ప్రతి ఒక్కరికి ఇచ్చి జనసేన పార్టీ గాజు గ్లాసు పంచడం జరిగింది. అందరి నోటా ఒకే మాట, మా ఓటు గ్లాసుకె అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, పరిజర్లపేట జనసేన పార్టీ ఎంపిటిసి పల్లా నాగు, రాజానగరం నియోజకవర్గ ఐటి కో-ఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, మన్య నాగు తదితరులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.