నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలషెడ్యూల్ ప్రకటన..

5 రాష్ట్రాలతో పాటు తిరుపతి, నాగార్జునసాగర్ ఉపఎన్నికల షెడ్యూల్           

తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ ఎన్నికల తేదీలు ప్రకటన

పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఐదు రాష్ట్రాలకు ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలతో పాటు తిరుపతి, నాగార్జునసాగర్ ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత బిహార్‌లో ఎన్నికలు జరగ్గా.. ఆ తర్వాత ఐదు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగనుండటం ఇదే మొదటిసారి.

పశ్చిమ్ బెంగాల్‌లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 33 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితో పాటు దేశంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పార్లమెంట్, తెలంగాణ‌లో నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉప-ఎన్నిక జరగనుంది.