నౌగడ గ్రామంలో జనసేన గిరిసేన 51వ రోజు కార్యక్రమం

పార్వతిపురం, మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలం పెదరామ(పంచాయితీ), నౌగడ గ్రామం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్బంగా గిరిజన నేత సీనియర్ రాజకీయ నాయుకులు మాజీ జడ్పీటీసీ పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ మాట్లాడుతూ.. నౌగడ గ్రామంలో మరియు మీ పంచాయతి పేదరామ పంచాయతీకి సంబందించిన వారు అందరూ జనసేన పార్టీలోకి రావాలి అని జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మాజీ ఎంపీటీసీ సవర వెంకటరావు స్థానిక జన సైనికులు సవర వేణు, రమేష్, సింధు, రవి, మహేష్ మరియు మండల నాయకులు సింహాద్రి రాజేష్ గణేష్ సీతంపేట జనసేన జనసేన నాయుకులు సైనికులు మాట్లాడుతూ.. సీతంపేట మండలంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి ప్రజలు భ్రమరధం పట్టడానికి సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిమ్మల నిబ్రమ్ నాయకత్వం బలోపేతం చెయ్యడానికి మీరు బాధ్యతగా పని చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వైస్ సర్పంచ్ సవర బుగేష్ పాల్గొన్నారు, గ్రామ పెద్దలు తలైబుస్థానిక జన సైనికులు సూర్యారావు, ఆనంద్ కుమార్, మిన్నరావు, శ్రీను, రాజేశ్, సోమేశ్, కిరణ్ పాల్గొన్నారు.