పెద్ద వడుగూరులో బాబు ష్యూరిటీ – పవనన్న గ్యారెంటీ

తాడిపత్రి: బాబు స్యూరిటీ – పవనన్న గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం పెద్ద వడుగూరు మండల కేంద్రం హరిజనవాడలో తాడిపత్రి జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జెసి అష్మిత్ రెడ్డి పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద వడుగూరు మండల జనసేన నాయకులు, కార్యకర్తలు, జెసి అనుచరులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.