జనం కోసం జనసేన 526వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన 527వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి మరియు వెదురుపాక గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 900 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 81860 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 528వ రోజు శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గోకవరం మండలం వెదురుపాక మరియు బావాజీపేట గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోశపాటి సుబ్బారావు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, తిరుమలాయపాలెం ఎంపీటీసీ చెన్నంశెట్టి చక్రరావు, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి ఓరుగంటి సాయి, గుమ్మళ్ళదొడ్డి గ్రామం నుండి కాంటు రమణ, కేత వెంకటేష్, వెదురుపాక గ్రామం నుండి బొర్రా రాంబాబు, యంట్రపాటి శ్రీను, కామిశెట్టి ప్రసాద్, రెడ్డి అప్పారావు, కండేల్లి జాను, అచ్యుతాపురం గ్రామం నుండి శంక వీరబాబు, సోమరోతు రాధకృష్ణ, రంపయర్రంపాలెం గ్రామం నుండి నరుకుల శివన్నారాయణ, గుత్తి శివ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ ల కు కృతజ్ఞతలు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ఓరుగంటి సాయి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.