మీతో మీ కార్పొరేటర్ 61 వ రోజు

విశాఖ, అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో బుధవారం మీతో మీ కార్పొరేటర్ సమస్యలపై కలసి పోరాడదాం అనే కార్యక్రమంలో భాగంగా అరవై ఒకటివ రోజుకి పెద్ద గొల్లల సందు, వెంకటేశ్వర మెట్ట, 33వ వార్డు ప్రాంతంలో ప్రతి ఇంటింటికి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకొని.. 3284 ఇల్లులు సర్వే చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపికృష్ణ(జికె) పర్యవేక్షణలో నిర్వహించబడింది, నాతో పాటు జనసైనికులు, వీరమహిళలు వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని దక్షిణ నియోజకవర్గం జివిఎంసి ఫ్లోర్ లీడర్ జనసేన పార్టీ 33వ వార్డ్ కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి అన్నారు.