6వ డివిజన్ జనసేన ఆత్మీయ సమావేశం

విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ 6వ డివిజన్ అధ్యక్షులు పల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో డివిజన్ నాయకుల మరియు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త & రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పాల్గొని డివిజన్ సమస్యలపై మరియు రాబోయే సార్వతిక ఎన్నికల గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ నాయకులు దోమకొండ అశోక్, 19వ డివిజన్ అధ్యక్షులు వటాల హరిప్రసాద్, 6వ డివిజన్ వీర మహిళలు, నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.