పుట్టపర్తి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ ఉత్సవం

కొత్తగ ఏర్పడిన సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత దేశ 73వ గణతంత్ర దినోత్సవ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్ధుల్ అబు మాట్లాడుతూ “మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ వైస్సార్ ప్రభుత్వం వ్యవరిస్తుంది వచ్చేది జనసేన పార్టీ నే” అని అన్నారు. జనసేన నాయకులు డా. తిరుపతేంద్ర, కొత్తచెరువు పెటా రాము, బోయ వంశీ, మేకల పవన్, సాయి ప్రభు, మాండ్లి ఆదిశేషు, నారాయణ స్వామి, అభి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.