పిల్లల సమక్షంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎమ్మిగనూరు, గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మిగనూరులోని మదర్ తెరిసా స్కూల్ లో ఆట పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ మెమొంటో చల్లా వరుణ్ అందజేసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు చల్లా వరుణ్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం గొప్పతనం విద్యార్థులకు వివరిస్తూ… పిల్లలతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. భవిష్యత్తులో పిల్లలు మంచి ఉన్నత స్థాయికి వెళ్లాలని తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల గౌరవంగా ఉండాలని సమాజం పట్ల బాధ్యత ఉండాలని అని అన్నారు.