2020 ముగిసేలోగా ప్రతి ఒక్కరికి 8 లక్షల ఆస్తి !

ఏపీ సి‌ఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను పాద యాత్ర చేస్తున్న సమయంలో అమ్మలు అక్కలు అవ్వలు తాతలు ఇలా చాలా మంది సొంత ఇల్లు లేక పురి గుడిసెలోను, వారు సంపాదించిన దాంట్లో 40 శాతం ఇంటి రెంట్స్ కే కట్టేవారని, ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న ప్రతి ఒక్క పెదవారికి సొంత ఇల్లు కట్టించాలని, ఆ ధ్యేయంతోనే ఇన్ని రోజులు ప్రజల కోసం పని చేశాను అన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవ్వుతుంది. మా మ్యానిఫెస్టోలో ఉన్నదానికి మేము 95 శాతం పూర్తి చేశాం అన్నారు. ఇక 2020 రాష్ట్ర ప్రజల అందరికి తీపి జ్ఞాపకాలు నెమరవేసుకునే విదంగా మా ప్రభుత్వం చేసిందని అన్నా రు. 87 లక్షలకు పైగా అక్క చెల్లలు ఆసరా ద్వారా లబ్ది చేకూర్చము అన్నారు. 62 లక్షల మంది కి నేరుగా ఇంటికే ఫించన్ తీసుకు వచ్చే విదంగా ఏర్పాటు చేశాం అన్నాడు.18.50 లక్షల మందికి విధ్య దీవెన, 1.30 కోట్ల మందికి ఆరోగ్య శ్రీ అందించాం అన్నారు. సంక్రాంతి కి ముందుగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుతుందని అన్నారు.

అందుకు 28 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అలాగే గుంకలంలో లే అవుట్ లో ప్రస్తుత భూమి విలువ 3 లక్షలు ఇల్లు పూర్తి చేసి ఇస్తే 8 లక్షల ఆస్తి ఇచ్చినట్లు అవ్వుతుందని గుర్తుచేశారు. అక్కడే అన్నీ రకాల వసతులు ఏర్పాటు చేస్తాం అన్నారు, బ్యాంక్స్, ఏ‌టి‌ఎం లు ఆసుపత్రులు, విద్యుత్ లైట్స్ ఒక నగర పంచాయతిలో ఎమి వసతులు ఉంటాయో అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *