దుగువ సంపాలు గ్రామంలో సమస్యల విలయతాండవం

  • జనసేన గిరిగ్రామపర్యటనలో భాగంగా దుగువ సంపాలు గ్రామంలో జనసేన నాయకుల పర్యటన

అల్లూరీ సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం జనసేన పార్టీ నాయకులు గిరిగ్రామపర్యటనలో భాగంగా జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, అరడ స్వామి అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. గంగులయ్య అదేశాలమేరకు సోమవారం పాడేరు జిల్లా కేంద్రానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో గల ఆదివాసీ గ్రామమైన దిగువ సంపాలు గ్రామాన్ని సందర్శించి, ఆ గ్రామస్తులతో సమస్యలపై చర్చించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు తమ గ్రామసమస్యలు తెలుపుతూ మాకు పాడేరు అతిసమీపమే అయినప్పటికీ ఏ కష్టమొచ్చినా వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదని, ఆలాగే విద్యుత్ సమస్య, మంచినీటి సౌకర్యం లేదని సుమారు 3 కిలో మీటర్ల దూరం నుంచి సొంతంగా పైపు వేసుకున్నామని, ప్రభుత్వాలు స్పందించే ఆలోచన చెయ్యదని, అలాగే అంగన్ వాడి భవనం, ప్రభుత్వ స్వగృహ కల్పన సదుపాయం లేదు, కొత్త వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ పధకం లేదు అలాగే గతంలో రోడ్డు కోసం పలుమార్లు స్పందన కార్యక్రమంలో అర్జీలు పెట్టినప్పటికీ ఫలితం లేదు. రోడ్డు పూర్తి ఆయినట్టు కాంట్రాక్టర్లు, బిల్లులు మార్చుకున్నారు. అయితే ఈ విషయం ఐటిడిఎ అధికారులకు సైతం తెలుసు. దీనిపై స్పందించిన అధికారులు కొద్దిరోజుల్లోనే పూర్తి చేయిస్తామని మా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. నేటికీ మూడు మాసాలు గడిచినా ఈ సమస్యపై ఉలుకూ.. పలుకూ లేదు. దయచేసి మీరైనా జనసేన పార్టీ తరుపున మా సమస్యల పట్ల అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరించవలిసిందిగా కోరుతున్నామన్నారు. ఈ విషయమై స్పందించిన రాజన్ తప్పకుండా మా వంతుగా కచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వా అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తామని, ప్రజల తరపున అండగా ఉంటూ ప్రశ్నిస్తామని గ్రామస్తులకు తెలిపారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2023-05-23-at-6.18.21-AM-1024x576.jpeg