ఘనంగా సుభాషిని పుట్టినరోజు వేడుకలు

అమలాపురం: చిందాడగరువు ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వర రావు దంపతుల మొదటి కుమార్తె సుభాషిని పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా ముఖ్య రెవెన్యూ కార్యదర్శి సిహెచ్ సత్తిబాబు దంపతులు ఇద్దరు సుభాషినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అక్షింతలు వేసి శుభాశీస్సులు అందించారు. పుట్టినరోజు వేడుకలలో భాగంగా కొంకాపల్లి హరి మనోవికాస కేంద్రంలో మానసిక పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. అలాగే ఆ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరి మనోవికాస కేంద్రం ప్రథమ ఉపాధ్యాయులు సూర్య కళ, శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు.