కవిత్వమే ఆయుధంగా కులవివక్షపై పోరాడిన యోధుడు గుఱ్ఱం జాషువా

  • జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, సమాజంలో తనకెదురైన కులవివక్షపై, మూఢాచారాలపై కవిత్వమే ఆయుధంగా పోరాడిన గొప్ప యోధుడు విశ్వకవి గుఱ్ఱం జాషువా అని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ఆధునిక కవులలో అగ్రస్థానం పొందిన గుఱ్ఱం జాషువా 127వ జయంతి సందర్భంగా నగరంపాలెంలోని ఆయన విగ్రహానికి జనసైనికులు ఆదివారం పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ బాల్యం నుంచి అగ్ర కుల అహంకారాలను, సంఘ సంఘర్షణలను ఎదుర్కొన్న జాషువా, గుండెల్ని తాకే తన భావకవితలతో ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందిన గొప్ప ఉన్నతుడు గుఱ్ఱం జాషువా అని కొనియాడారు. మరోవైపు గబ్బిలం, ఫిరదౌసి, బాపూజీ, కొత్తలోకం, ముంతాజ్ మహల్ వంటి 36 మహోన్నతమైన గ్రంధాలతో పాటు లెక్కలేనన్ని కవితా ఖండికలు రచించిన గుర్రం జాషువా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందారన్నారు. గుఱ్ఱం జాషువా అందించిన స్పూర్తితో సమాజంలో ఎలాంటి అసమానతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్సులు బండారు రవీంద్ర, బుడంపాడు కోటి, కోనేటి ప్రసాద్ మైనారిటీ నాయకులు షర్ఫుద్దీన్, బాషా, గోపిశెట్టి రాజశేఖర్, దొంత నరేష్, ఇళ్ళ శేషు, వడ్డె సుబ్బారావు, కోటేశ్వరరావు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.