‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ టీజర్.. అంచనా కంటే మరో స్థాయిలో

యావత్తు భారత సినీ పరిశ్రమ ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ ఒక‌టి. క‌న్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా సెన్సేష‌న‌ల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న ఉదయం 10:18 గంటలకు ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ టీజర్‌ను విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దీంతో యశ్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ‘కె.జి.యఫ్’ ఫ్యాన్స్ ఈ టీజర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వాళ్లందరికీ సర్‌ప్రైజ్ ఇస్తూ గురువారం రాత్రి ఈ టీజర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకులు ఊహించిన దాని కంటే మరో స్థాయిలో ఉంది ఈ టీజర్.

అమ్మకి ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే రాకీభాయ్ ని టీజర్ లో చూపించారు. ‘పవర్ పుల్ పీపుల్ పవర్ ఫుల్ ప్లేషెస్ నుంచి వస్తారని చరిత్ర చెబుతోంది’ అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన టీజర్ గూస్ బమ్స్ కలిగిస్తోంది. టీజర్ చివర్లో రాకీభాయ్ గా యష్ ఓ మెషిన్ గన్ పట్టుకొని కాల్చే సీన్ అద్భుతంగా ఉంది. కాలుతున్న మెషిన్ గన్ కి సిగరెట్ ముట్టించుకుంటూ యష్ కోపంగా చూడటంతో టీజర్ పూర్తయింది. మొదటి చాప్టర్ ని మించి ఇందులో యాక్షన్ సీన్స్ ఉన్నాయని అర్థం అవుతోంది. రవి భాస్కర్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.