సంక్రాంతి కానుకగా ‘వకీల్ సాబ్’ టీజర్

పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్ డేట్ అయినా సరే అభిమానులకు పెద్ద ట్రీట్ లా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ యూనిట్ పవర్ స్టార్ అభిమానులకు సంక్రాంతి కానుక ఇవ్వదలిచింది. జనవరి 14న సాయంత్రం 6.03 గంటలకు ‘వకీల్ సాబ్’ టీజర్ విడుదల చేయనున్నారు.