సెక్షన్ 30 అమలుపై మండి పడిన మాకినీడి..!

  • వారాహి యాత్ర చేపట్టడంతో అధికార పార్టీకి గుబులు పడుతుంది

పిఠాపురం: ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టడంతో అధికార పార్టీకి గుబులు పడుతుంది అనే అంశానికి సజీవ సాక్షిగా రాత్రికి రాత్రే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయడం రుజువు చేస్తుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి వైకాపా ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోటకూడా గెలవలేనోడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేనివాడు అని హేళనకి చేసిన వ్యక్తిని చూస్తే అధికార పార్టీకి ఎందుకు మచ్చలు పడుతున్నాయని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసే ఏ నాయకుడైన ప్రజలు సమస్యలు తెలుసుకునే ప్రాథమిక హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్ర పై రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబరిచి పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో పవన్ పై పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక పోలీసులను అడ్డం పెట్టుకుని సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయడం వైకాపా ప్రభుత్వం యొక్క పిరికితనాన్ని స్పష్టం చేస్తుందని శేషు కుమారి తెలిపారు. జగన్ పాదయాత్ర సమయంలో అప్పటి ప్రభుత్వం ఇటువంటి కుట్ర పూరితమైన నియంత పోకడలకు పాల్పడితే జగన్ పాదయాత్ర ఎలా నిర్వహించేవారు. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులకు లోబడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రను అడ్డుకునేందుకు ఇటువంటి అడ్డుగోలు ఆటంకాలు కల్పించినంతమాత్రాన ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.