వేలేరుపాడు జనసేన కార్యాలయంపై వైసీపీ గుండాల దాడి..

పోలవరం నియోజకవర్గం: వేలేరుపాడులోని జనసేన పార్టీ మండల కార్యాలయంపై మండల అధ్యక్షులు ఆదినారాయణ, ఉపాధ్యక్షులు మేచినేని సంజయ్ మరియు మరో 8 మంది జనసైనికుల మీద మంగళవారం రాత్రి సుమారు 60 మంది వైసీపీ గుండాలు దాడి చేసారు. కార్యాలయాన్ని ధ్వంసం చేసారు. ఈ ఘటనలో కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు స్పందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి 7 మండల అధ్యక్షులు లీగల్ సెల్ కమిటీ సభ్యులు కొండబత్తుల నరసింహారావు, డి.కే.వి ప్రసాద్ బాబు, జనసైనికులు, నాయకులతో కలిసి వేలేరుపాడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు నమోదు చేయించారు. ఈ విషయాన్నీ వదిలేది లేదని, మా సహనాన్ని పరీక్షించవద్దని, రౌడీ రాజకీయం చెయ్యొద్దని హెచ్చరించారు. పులులు సింహాలు అని చెప్పుకోవడం కాదని, పోలవరం ప్రాజెక్ట్ చేసి చూపించాలని, అంతే గాని అవినీతిని ప్రశ్నిస్తే దాడికి దిగుతారా? అని ప్రశ్నించారు. మీ జగన్ కడప రౌడీ రాజకీయాలు ఇక్కడ చెయ్యాలని చూస్తే.. చూస్తూ ఊరుకోమని ఆయన మండిపడ్డారు.