జనసేనానిపై చేసిన విమర్శలు వెంటనే వెనక్కి తీసుకోవాలి..
గజపతినగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన విమర్శలపై దత్తిరాజేరు మండలం అధ్యక్షులు చప్పా అప్పారావు మరియు గజపతినగరం మండలం అధ్యక్షులు మునకాల జనార్ధరావు (జగన్) విరుచుపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేర్ని నాని చేసిన విమర్శలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరారు. ఒక్కోసారి మీరు మా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే మా వీరమహిళలు చెప్పుతో కొడతారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యనిర్యహన కమిటీ సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్ మండల నాయకులు మార్పిన అప్పలనాయుడు, సింహాద్రి ప్రవీణ్, నడుపూరు చరణ్, సాయి కిరణ్ చిన్నారావు, పవన్, ప్రసాద్ జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-15-at-10.09.09-PM-1024x576.jpeg)