యూట్యూబ్ స్టార్ వైవా హర్ష నిశ్చితార్ధం

యూట్యూబ్ స్టార్, హోస్ట్ వైవా హర్ష నిశ్చితార్ధం శనివారం అక్షర తో జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలని హర్ష తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అవి వైరల్‌గా మారాయి. ఆ ఫొటోకు ‘చివరి బ్యాచిలర్‌ సెల్ఫీ’ అని క్యాప్షన్‌ను రాసుకొచ్చాడు హర్ష. కాగా హర్ష, అక్షరలు దండలు మార్చుకొని అనంతరం కేక్ కట్ చేశారు. హర్ష ఇటీవల కలర్ ఫోటో సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే హర్ష యూట్యూబ్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. వైవా సిరీస్ హర్షకు ఎంతో పెరుతీసుకొచ్చింది. అంతేకాకుండా హర్ష ప్రస్తుతం ఆహాలో తమాషా విత్ హర్ష అనే టాక్ షోకు హోస్ట్‌గా కూడా పని చేస్తున్నాడు.