ఉద్యమ కారులను గుర్తించడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది

తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి

హుస్నాబాద్: నా తెలంగాణ మన తెలంగాణ కోసం ఉద్యమకారులు రాళ్ళు ఏరుకొచ్చి పొయ్యి పెట్టినారు. సహా యువత కట్టెలు ఏరు కోస్తే పోలీస్ వ్యవస్థతో ఆ కట్టెలు గుంజుతే ఒళ్ళు కాల్చుకొని పోయ్యిల మంట పెట్టినారు.. సహా ఉద్యోగ సంఘాలు గంజుపెట్టి నీళ్ళు పోసి, సహా రైతు సంఘాలు బియ్యం వేసి ఉడికే టైంకు వచ్చి బిర్యానీ నేను వండినా అని చెప్పుకుతిరుగుతున్నవ్.. ఉద్యమ కారులను గుర్తించడానికి నీకు 10 సంవత్సరాలు పట్టింది అది ఓటు కోసమే తప్ప నీకు ప్రేమ ఎక్కడిది. రైతులకు బేడీలు వేయిస్తివి, యువతకు దారి లేకుండా అత్యున్నత పరీక్షలను అపహాశ్యం చేసినవ్, ఆర్టీసీ కార్మికులను రోడ్ మీద పడేసినవ్, ధరణి పేరు చెప్పి ఆ ధరణి నే దోచుకుంటున్నారు. మీ అనుంగు శిష్యులు మీరు కలిసి, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చెస్తివి. పోటీ పరీక్షలో నెగ్గిన విద్యార్థులను, ఏ పరీక్ష రాయని వారిని ఒకే చోట చేరుస్తున్నావు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు ఆంటీవి ఏది నీ ప్రతిజ్ఞ, కురుమ సోదరుల దగ్గర యూనిట్ కు 42 వేలు వసూలు చేసి అందరికీ ఆ యూనిట్లు పంచక పోతివి. 42000 నాలుగు సంవత్సరాలు ఐతుంది. వాటికి వడ్డీలు నువ్వే తిన బడితివి. డబుల్ బెడ్రూం ఆంటివి. ఇంటికి వచ్చిన అల్లుడు ఏడ పందుకుంటడు అని కల్లబొల్లి మాటలు చెబుతూ ఓట్లు వేయించుకుంటివి.. అన్ని చూస్తున్నాము. అర్దం అయ్యేలా ప్రజలకు చెబుతున్నాము. రాసుకుంటూ పోతే రోజు పడుతుంది నీవు అబద్దం చెప్పి ప్రజలను మోసం చేస్తున్న విధానం గురించి. మొన్న మొన్న 10000 వర్షాలకు నష్టపోయిన రైతులకు పంపుతానంటివి ఏది నీ మాట. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ జైలులో పెడుతున్నారు. ఇది నిరంకుశ పాలన కాదా..?. ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ రాష్ట్ర బిల్లు కోసం నీ కుటుంబం ఏమి త్యాగం చెయ్యలేదు కానీ.. వాటి ఫలాలు మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. కోట్లల్లో మీ ఆస్తులు పెరిగాయి.. ఉద్యమ కాలంలో ఇస్త్రీ లేని చొక్కాలు ఎన్ని సార్లు వేసుకున్నవి లెక్క చెప్పాలా?. ఈ రోజు మీ ఆస్తులు ఎలా పెరిగాయి. దేశం మొత్తం ఎన్నికల ఖర్చు నేనే పెడతా అంటే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతలా దోచుకున్నారు అనేది విజ్ఞత తెలిసిన ఓటరుకే వదిలేస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.