టిడ్కో గృహాలలో నివసించే వారికి కనీస అవసరాలు కల్పించండి

  • కలెక్టర్ ను కోరిన 7వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గండి దేవీహారిక

అమలాపురం: బోడసకుర్రు గ్రామంలోని టిడ్కో గృహాలను అమలాపురం మున్సిపాలిటీకి చెందిన 1320 మంది లబ్ధిదారులకు కేటాయించగా ప్రస్తుతం దానిలో సుమారు 150 కుటుంబాలకు పైబడి నివసిస్తున్నారు. అంతేకాకుండా మరో 300 మందికి అక్కడ పట్టాలు ఇచ్చియున్నారు అంటే సుమారు 1620 మంది కుటుంబాలకు త్రాగునీరు, డ్రైనేజ్ సదుపాయాలు, స్మశాన వాటిక లేకపోవడంతో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదు. రెండు రోజుల క్రితం టిడ్కో గృహంలో నివసించే ఒకవ్యక్తి మరణిస్తే ఇప్పటి వరకూ దహన సంస్కారాలు చేయలేని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు నివసిస్తున్నారు. ఈ సమస్యపై సోమవారం స్పందన కార్యక్రమం నందు 7వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గండి దేవీహారిక జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మరియు రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.